SAKSHITHA NEWS

అమరావతి

వైసీపీ ముఖ్యనేతలతో సీఎం జగన్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ భేటీకి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు..

సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దుతో పాటు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ముందు హాజరు కానుండటం తదితర పరిణామాల క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరఫున ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై నేతలతో జగన్‌ చర్చించినట్లు సమాచారం..


SAKSHITHA NEWS