CM Chandrababu: పేదలకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

CM Chandrababu: పేదలకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

SAKSHITHA NEWS

CM Chandrababu: Good news for poor, unemployed..

CM Chandrababu: పేదలకు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

_ ఆ 5 ఫైళ్లపై బాబు సంతకాలు

ఏపీలో NDA సర్కార్‌ కొలువుదీరింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

జూన్ 13, గురువారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

సాయంత్రం 4.41కు ఛార్జ్ తీసుకోనున్నారు. అయితే బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన తొలిగా ఏ ఫైళ్లపై సంతకాలు చేస్తారనే అంశంపై సస్పెన్స్ వీడింది.

మొత్తం ఐదు ఫైల్స్‌పై సీఎం చంద్రబాబు సంతకాలు చేయనున్నారు.

అందుకు సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  1. మెగా డీఎస్సీపై మొదటి సంతకం
  2. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం
  3. పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం
  4. అన్న క్యాంటీన్‌ల పునరుద్ధరణపై నాలుగో సంతకం
  5. స్కిల్ సెన్సెస్‌పై ఐదో సంతకం

మరోవైపు సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన… ఇవాళ మరోసారి తిరుమలకు బయల్దేరుతున్నారు. సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు చంద్రబాబు.

కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఇవాళ తిరుమల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి… గురువారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి తొలి పర్యటనగా తిరుమలకు చంద్రబాబు వెళ్తుండటంతో… అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Image 2024 06 12 at 18.39.12

SAKSHITHA NEWS