SAKSHITHA NEWS

అచ్చంపేట నియోజకవర్గం లో ప్రమాదంలో పౌర స్వేచ్ఛ
ఎమ్మెల్యే ఆ ఇలాకలో ఆడింది ఆట, పాడింది పాట!
స్వపక్ష పార్టీల ఎంపీలకు, ఎమ్మెల్యేలకు గువ్వల ఫోన్ బెదిరింపులు
అహంకారంతో ఇమేజ్ పడిపోతుందంటున్న ప్రజానీకం
ప్రజాస్వామ్యం కాదు నియంతృత్వం?


సాక్షిత : ఆయన ఓ ప్రజా ప్రతినిధి, రెండుసార్లు నియోజక వర్గానికి ప్రాతినిత్యం వహించిన ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ .. కానీ ఆయన నోరు కు అడ్డు అదుపు ఉండదు .. ఆయన ఏం మాట్లాడాలనుకుంటే అదే మాట్లాడుతాడు… వారు స్వపక్షం ,విపక్షం వారైనా అంతా సేమ్ .సేమ్.. ప్రజా ప్రతినిధుల పై అనుకుంటే పొరపాటే…ఐపీఎస్ , ఐఏఎస్ లతో పాటు గ్రూప్ టూ ర్యాంకర్ అయినా, స్లీపర్ అయినా సేమ్ వార్నింగ్.. అది ఆయన నైజం ఇజం కూడా. ఆయన ముందు రూల్స్, రెగ్యులేషన్స్ అంతా జాన్తా నహి… అక్కడ అంతా గువ్వల రూల్ ఆఫ్ లా అమలు కావాల్సిందే. లేకపోతే ఆయన నోటికి పని చెప్తాడు .. ఎంతటి వారైనా తిట్లకు వినాల్సిందే.. లేకపోతే కథ మరోలాగా.. ఎప్పుడు ఎవరిమీద ఉప్పెనెల ఊగిపోతాడో, ఎవరికీ అర్థం కాని పరిస్థితి. నియోజకవర్గానికి ఎమ్మెల్యే వచ్చాడంటే సంతోషం కంటే అవమానం, భయమే ఈ ప్రాంత ప్రజలలో ఎక్కువ అన్న ధోరణి వినిపిస్తుంది.

సహచర ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ స్వపక్ష, విపక్ష ప్రజాప్రతినిధులపై నోరు పారేసుకుంటుడం తో వారు కస్సు,బుస్సు మంటున్నారు. ఆయనకు ఒకపక్క ఎమ్మెల్య హోదా, మరొక ప్రభుత్వ విప్ ఉండడంతో ఏం చేయలేక అదును కోసం ప్రజలు వేచి చూస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఆయన ఎవరో కాదు చట్టాలను తయారు చేసే బాధ్యతాయుత హోదాలో ఉన్న చట్టం చదివిన వ్యక్తి ..ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఈయనకు చట్టం చుట్టం కావాల్సిందే. ఈ ఇలాకాలో గువ్వల రూల్ ఆఫ్ ల అమలు కావాల్సిందే నని ప్రజలు రుసరుసలా డుతున్నారు.

వివరాల్లోకెళ్తే వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం పుల్కమామిడి ప్రాంతానికి చెందిన గువ్వల బాలరాజు అచ్చంపేట నియోజకవర్గంలో 201,4, 2018 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన అచ్చంపేట ప్రాంత వాసి కాకున్నా, టిఆర్ఎస్ పార్టీ పై ఉన్న ప్రేమతో ప్రజలు ఆయనకు రెండు సార్లు పట్టం కట్టారు. అంతకుముందు నాగర్ కర్నూల్ పార్లమెంటు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి, ఓటమిపాలు అయ్యారు. ఇది ఇలా ఉంటే నియోజకవర్గంలోని చిన్నచిన్న విషయాలకు కసురుకోవడంతో పాటు ప్రజలపై వెంగస్త్రాలను సంధిస్తున్నారు.

ఇలా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో నోరును పారేసుకుంటూ ప్రజల నాలుకలో నా తున్నాడు. ప్రస్తుతం స్వపార్టీ నేత, సొంత పార్లమెంట్ పార్లమెంటు సభ్యుడు పి. రాములు కు ఫోన్ చేసి అచ్చంపేట నియోజకవర్గంలో నీ ఫోటోలు , నీ కొడుకు కల్వకుర్తి జడ్పిటిసి భరత్ ప్రసాద్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని ఎం.పీకి ఫోన్లో హుకుం జారీ చేశారు. నువ్వు ఏర్పాటు చేస్తే నేనేంటో చూపిస్తానంటూ ఓ రకంగా భయపెట్టాడు. దీంతో ఎం.పీ రాములు నేను చాలా సీనియర్ ను, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉందంటూ సుతి మెత్తగా సమాధానం ఇచ్చారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అచ్చంపేట నియోజకవర్గం లో ఓ ఎం.పీ ఫోటో వద్దంటూ ఎమ్మెల్యే చేసిన ఫోన్ కాల్స్ తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. గతంలో ఆ ఎంపీ నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

అలాగే కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో స్థానిక శాసనసభ్యులు గురక జైయపాల్ యాదవ్ కు ఫోన్ చేసి విచక్షణ రహితంగా మాట్లాడడంతో ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అచ్చంపేట ప్రాంతానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కళాకారుడు మొగులయ్య కు పద్మశ్రీ అవార్డు రావడంతో ఆయనకు ప్రభుత్వం అధికారికంగా సభను ఏర్పాటు చేసింది .ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆలస్యంగా రావడంతో పాటు నాకెందుకు చెప్పలేదు అంటూ అక్కడున్న అధికారిపై కోపం వ్యక్తం చేయడంతో పాటు పక్కనే ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కూడా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. శివరాత్రి పురస్కారాలను పురస్కరించుకొని బరంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవంలో తమకు పూర్ణకుంమంతో స్వాగతం పలకలేదంటూ అక్కడున్న ఓ జిల్లా స్థాయి అధికారి పై పౌరుష పదజాలంతో విరుచుక పడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశదినకర్మ రోజు పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ పాలమూరుకు వచ్చారు.

ఆ సమయంలో ఎమ్మెల్యే బాలరాజు ను వాహనంతో వెళ్లొద్దంటూ పోలీసులు అనుమతించలేదు. దీంతో కోపోద్రిక్తుడై మీ అంతు చూస్తానంటూ వారిని ఒరే , అరే అనడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. అలాగే రాజ్యాంగం మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు, దళితులకు మూడు ఎకరాల భూమి, సీఎం పదవి ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందని ప్రశ్నించారు. వెంటనే బీఎస్పీ నాయకులు అచ్చంపేట ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు పోటీచేయాలని ఎక్కడైనా రాసి ఉందా అని వారు ప్రశ్నించారు. అలాగే నియోజకవర్గంలోని మహిళా అధికారుల పట్ల, సీనియర్ నాయకులపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నార నే ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. గత స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయంలో 2009 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీని వీడి వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకోవాలని తహతహలాడిన విషయం నిజం కాదా అని అచ్చంపేట వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ పార్టీ మారే విషయంపై పాం హౌజ్ కేసు ఒక ఉత్కంఠ పరిస్థితిలో ఉందని, నిజంగానే బిజెపి వేసిన ఇరకు బలైపోయారా ,? లేక ఇంటెలిజెన్సీ , స్పెషల్ బ్రాంచ్ అధికారులు వేసిన స్కెచ్ లో ఇ రుకున్నరా, లేక పార్టీ ప్రతిష్ట దిగజారుతుందనే వెనకేసుకొచ్చారా …!? అనే విషయాలు నెగ్గు తేల్చేసిన మీ మాంస నెలకుంది.

ఇది ఇలాగే ఉంటే పరిస్థితి చేయి దాటి పోకముందే చక్కదిద్దుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని, లేకపోతే పూలు అమ్మినచోట కట్టెల అవ్వాల్సిన పరిస్థితి దాపురిస్తుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఇసుక విచ్చలవిడిగా నడుస్తుండటంతో పాటు ఇక్కడి రాజకీయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరబూస్తుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. విద్యారంగం మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది అనేది జేగ మెరిగిన సత్యం. ప్రజలకు అవసరం పడే ప్రజాప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా ,సహచర నాయకుల పై విరుచుకపడడం సమంజసం కాదని బహిరంగంగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే పార్టీ ప్రతిష్ట కూడా మట్టిలో కలిసే అవకాశం ఉందని టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


SAKSHITHA NEWS