SAKSHITHA NEWS

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదును చట్ట ప్రకారం పరిష్కరించడం జరుగుతుందనీ, సివిల్ వివాదాలు మాత్రం పోలీస్ స్టేషన్ లలో పరిష్కరించబడవు అనే విషయాన్నీ పిర్యాదులు దారులు గ్రహించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన గారు తెలిపారు.

సోమవారం ప్రజావాణి లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంకు వచ్చిన 18 అర్జీలను జిల్లా ఎస్పీ గారు స్వీకరించారు. వారి సమస్యలను విన్న జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్షంగా వైర్లెస్ సెట్లో లో మాట్లాడి బాధితుల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, సునిశితమైన అంశాలకు సంబంధించిన పిర్యాదుల విషయంలో కౌన్సిలింగ్ నిర్వహించాలని, భూములకు సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు అయినా కోర్టు ద్వారానే పరిష్కరించుకునేటట్లు పిర్యాదు దారులకు తెలియజేయాలని సూచించారు.
ఈ రోజు వచ్చిన పిర్యాదుల లో 1).భూ వివాదాలకు సంబందించి 06 పిర్యాదులు,
2).భూమి విషయంలో ఇంటిమీదకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని -02 పిర్యాదులు.
3). జాబ్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేశారని 01.
4).సంతకం పోర్జరి చేశారని 01
5).దొంగతనంకు సంభందించి 01.
6). హత్య యత్నం కు సంబందించి 01.
7). రేప్ కేసుకు సంబందించి 01.
8). పొలం గొడవలలో కులం పేరుతో దూషించారని 01.

9). ఇతర అంశాలకు సంబంధించి 04 పిర్యాదులు.

జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా


SAKSHITHA NEWS