హర్యానా ప్రాంతాల్లో పారిశ్రామిక కార్మికులపై జరుగుతున్న అణచివేతను నిరసిస్తూ సీఐటీయూ ఆదర్యంలో ఎన్టీపీసీ గేట్ నంబర్-2 వద్ద ప్లే కార్డ్స్ తో నిరసన…
సాక్షిత పెద్దపల్లి//ఎన్టిపీసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా, హర్యానా ప్రాంతాల్లో పారిశ్రామిక కార్మికులపై జరుగుతున్న అణచివేతను నిరసిస్తూ, సిఐటియు కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా, ఎన్టీపీసీ గేట్ నంబర్-2 వద్ద సీఐటీయూ అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో.. ప్లే కార్డ్స్ తో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు దండ రాఘవరెడ్డి మాట్లాడుతూ, నోయిడాలోని పరిశ్రమల్లో కార్మికులను నిర్బంధించి, 10 నుండి 12 గంటల పాటు వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం 10 వేల నుండి 12 వేల రూపాయల వేతనానికే పనిచేయిస్తూ, పీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు. దీనిపై శాంతియుతంగా పోరాడుతున్న సుమారు 500 మంది కార్మికులను, సీఐటీయూ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
అరెస్టయిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి, జిల్లా కోశాధికారి ఎం. రామాచారి, ఉపాధ్యక్షులు దండ రాఘవరెడ్డి, కె.రాజ్ కుమార్, టి.రవీందర్, బి.వెంకటేశం, బి.హనుమయ్య,కె. లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY