రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్, NTR నగర్ కాలనీలలో గల మసీదు ల వద్ద జరిగిన బట్టల పంపిణీ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , శ్రీ నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు బట్టలను పంపిణి చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లిం సోదరి సోదర మణులకు పండుగను ధనిక ,పేద బేధం లేకుండా సుఖసంతోషాలతో జరుపుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగినది అని, వారి కుటుంబాలలో సంతోషం వెల్లివిరియాలనే ఉద్దేశ్యంతో బట్టల పంపిణీ చేపట్టడం జరిగినది అని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు అని, రంజాన్ మాసం ఉపవాసం తో మంచి తనం ,సంస్కారం అలవడుతుందని ,మతసామరస్యానికి ప్రతీక ,అందరూ కల్సి ఉండాలని , ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగినది అని , ముస్లింల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని ,పేద ముస్లిం కుటుంబాలకు పండుగ రోజున వెలితి లేకుండా, వారికీ ఎటువంటి లోటులేకుండా పండుగను సంతోషకరంగా జరుపుకోవాలని చెప్పడం జరిగినది. రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులకు ఈదుగలకు అభివృద్ధి మరమ్మతులకు నిధులు కేటాయించడం, పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్లు అదేవిధంగా కుల మతం జాతి భేదం లేకుండా తెలంగాణ జాతి అంతా ఒకటే అని , ఆ దేవుడి కరుణకటాక్షాలు పొందేందుకు దేవుడి కృపకు దగ్గర కాగలమనేది ప్రతి ముస్లిం సోదరుల ప్రగాఢ విశ్వాసము అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ నెల మాసాన్ని పురస్కరించుకుని నియమ నిబంధనలు పాటించి ఉపవాస కఠోర దీక్షతో ప్రార్థనలు చేస్తారు. ఈ విధమైన ఆధ్యాత్మిక దైవ ప్రార్ధనలతో శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు
