ప్రణీత్ అంటిలియా లో జరిగిన కూల్చివేత్తలు అన్యాయం

Sakshitha news

ప్రణీత్ అంటిలియా లో జరిగిన కూల్చివేత్తలు అన్యాయం.
సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ.

కోర్ట్ లో స్టే ఉన్నప్పటికి గ్రీన్ బెల్ట్ లో ఉన్న ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేకుండా చర్యలు తీసుకునే అధికారం ఏ అధికారికి లేదని అలాంటిది నేడు హైడ్రా కూల్చివేయ్యడం చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ గారు నేడు బాచుపల్లి లోని ప్రణీత్ అంటిలియా ను సందర్శించి హైడ్రా చర్యలను నిరసించడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతు హైడ్రా ఏర్పాటు ను సిపిఐ గా స్వాగతించమని చెరువులను,ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి హైడ్రా ను ఏర్పాటు చేస్తే దానికి రంగనాధ్ గారు అధికారిగా ఉంటే సంతోషించమని కానీ నేటి చర్య వల్ల వారికీ మద్దత్తు కోసం పునరాలోచించాల్సిన అవసరం ఉందని గతంలో కూడా కొన్ని అబండాలు వస్తే నమ్మలేదని కానీ నేడు నమ్మాల్సి వస్తుందని ఇప్పటికైన హైడ్రా చర్యలు తీసుకునేముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

హైడ్రా చర్యల వెనుక రాజకీయ ఒత్తిడిలు,,రియల్ ఎస్టేట్ ప్రభావం కూడా ఉన్నటు స్పష్టంగా కనిపిస్తుందని కాలనీ వాసులకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని భవిష్యత్తులో వారికీ ఎలాంటి నష్టం రాకుండా హైడ్రా చర్యలు ఉండాలని స్పష్టం చేశారు.మూసి సుందరికరణ,చెరువుల పరిరక్షణ మరియు అభివృధి పనులలో మంచి పనులు జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారని ఇలాంటి చర్యల వల్ల నీసు హైడ్రా పై చెడు అభిప్రాయం ఏర్పడుతుందని కావున ఇలాంటి చర్య ల పై సిపిఐ గా ప్రతి కార్యక్రమం పై ద్రుష్టి పెట్టాల్సివస్తుందని ఏదో సహాయం చేస్తున్నామని చెప్పి రోడ్డు పేరిట గోడలు కూల్చివేయ్యడం అణగారికరమైన చర్య అని వెంటనే హైడ్రా కమీషనర్ చేసిన తప్పులకు క్షమాపణ లు చెప్పాలని అన్నారు.

గత వారం రోజుల నుండి స్ట్రీట్ లైట్స్,డ్రైనేజీ లైన్,ఎలక్ట్రిక్ కేబుల్ ల డిస్టరబన్స్ వల్ల ఇప్పటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నేటికైన వారి ఇబ్బందులు తీర్చాలని అన్నారు.కోర్ట్ లో సమస్యను త్వరిగతంగా పరిష్కరించుకోవాలని సమస్య పరిష్కారం కోసం సిపిఐ గా తోడ్పాటు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,మండల కార్యదర్శి స్వామి,కాలనీ ప్రెసిడెంట్ రాజిరెడ్డి కార్యదర్శి వెంకట్ రమణ సిపిఐ బాచుపల్లి సహాయ కార్యదర్శి దస్తగిరి, కోశాధికారి సదానంద్, నాయకులు కృష్ణ,నర్సింహా రెడ్డి,సహదేవ రెడ్డి,శ్రీనివాస్ చారి,భీమేష్,కాలనీ వాసులు కవిత,మైత్రి కుమార్ వంశీ లతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Scroll to Top