నారా లోకేష్ తో కలసి అమిత్ షాతో చిత్తూరు ఎంపీ భేటీ
సాక్షిత ప్రతినిధి – దిల్లీ / చిత్తూరు: రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బాబు, ఏపి హోం శాఖ మంత్రి అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహచర ఎంపీలతో కలసి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు భేటీ అయ్యారు. మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రి అమిత్ షాకు అందించారు. మొంథా తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
