10వ డివిజన్ లో రేషన్ షాప్ ప్రారంభం
** ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు హాజరు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తుందని జనసేన ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు చెప్పారు. పేదల కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం పునః ప్రారంభించిందని ఆయన తెలిపారు. 10వ డివిజన్ పరిధిలోని 35వ రేషన్ షాపును ఎమ్మెల్యే మంగళవారం పునః ప్రారంభించారు. కార్డుదారులకు ఎన్డీఏ కూటమి నేతలతో కలసి బియ్యం పంపిణీ చేశారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోందని ఆయన చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.
విధ్వంసం అయిన రాష్ట్రాన్ని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువనాయకులు, రాష్ట్ర విద్యా శాఖమంత్రి నారా లోకేష్ లు పునర్ నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ ఏడాదిన్నర లోపే అమలు చేసిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరినీ గుర్తించుకుని న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణా, టీడీపీ క్లస్టర్ ఇంచార్జీ పులిగోరు మురళీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, ఎన్డీఏ నాయకులు భరణి యాదవ్, రాజా రెడ్డి, వెంకటేశ్వర్లు, ఈతమాకుల హేమంత్ యాదవ్, గంగమ్మ గుడి ఆలయ పాలకమండలి సభ్యులు రుద్ర కిషోర్, ఆనంద్ గౌడ్, రామకృష్ణా తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
