తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ బాబు
లోకేష్ అన్న జన్మదిన వేడుకలు ఘనంగా చేసిన పడుగు పాడు టిడిపి నాయకులు
కోవూరు పడుగుపాడు చంద్రమౌళి నగర్ లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలతో టిడిపి నాయకుడు దారపనేని శ్రీనివాస్ నాయుడు, పడుగుపాడు గ్రామ అధ్యక్షులు బత్తుల రమేష్, ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు 43వ జన్మదిన వేడుకలను ఘనంగా చేశారు. ముందుగా స్వర్గీయులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం లోకేష్ అన్న జన్మదిన సందర్భంగా స్థానిక నాయకులతో కలసి అల్పాహారం, కేక్ కటింగ్, చాక్లెట్లు, బిస్కెట్లు, పంపిణీ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాడని ఐటిఐ, విద్యాశాఖ రంగాల్లో తన ముద్ర వేసి యువ నాయకుడుగా ప్రజల్లో ఉంటున్నాడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నతమైన పదవుల్లో ఆయన ఇంకా ఉండాలని భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. వారితో తెలుగుదేశం కుటుంబ సభ్యులు సయ్యద్ మసూద్, కొండ తిరుపతిరెడ్డి, గుండు బోయిన శ్రీనివాసులు, యక సిరిసుగుణమ్మ, పెద్ద సాయి, అబ్బోరు శ్రీనివాసులు, షేక్ షఫీ, షేక్ జమీర్, యస్.డి దస్తగిరి, గోడ సమాధానం, గొర్ల మల్లికార్జున్, దొడ్డకం శేఖర్, తదితరులు ఉన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY