“చింతల్ పద్మశాలి సంఘం” నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేస్ -2 రింగ్ రోడ్డు వద్ద చింతల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… పద్మశాలి సంఘం అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. మూడు పర్యాయాలు నా గెలుపులో కీలకంగా వ్యవహరించి హ్యాట్రిక్ గెలుపును అందించిన పద్మశాలి కులస్తులకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.
అనంతరం చింతల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు పాలడుగు సత్యనారాయణ జన్మదినోత్సవం సందర్భంగా కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కెఎం.గౌరిష్, మేడ్చల్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నెరాజు, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిషోర్ చారి, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, అధ్యక్షులు పాలడుగు సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు పెద్ది మల్లేశం, పెండ్యం లక్ష్మీ నర్సయ్య, ఉపాధ్యక్షులు భూ లక్ష్మణ్, బొంట్యాల రాజు, గోలి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిలివేరి ఆంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివేరి సత్యనారాయణ, కోశాధికారి నక్క గణేష్, కార్యవర్గ సభ్యులు కుమారస్వామి, వైకుంఠం, దాసి ఆంజనేయులు, బొల్లు నర్సింహులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.