హోప్ అఫ్ హంగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లోని హోప్ అఫ్ హంగర్ సేవా సంస్థ వారి పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పాఠశాల పిల్లలు నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని జోహార్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ బాలల దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి, రేపు దేశం బాగుండాలన్న దేశ భవిష్యత్తు బాగుండాలన్న అది నేటి బాలల చేతుల్లోనే ఉంటుంది అన్న చాచా నెహ్రూ మాటలను ఆదర్శంగా తీసుకుంటూ బాల బాలికలందరూ మంచిగా చదువుకొని అత్యుత్తమ శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు. హోప్ అఫ్ హంగర్ వారు ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ డే వేడుకలలో పిల్లలతో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పిల్లలను స్కూల్లకు పంపించడానికి కూడా ఆర్థికస్తోమత లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలలోని పిల్లలకు ఉత్తమ విద్య అందిస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హోప్ ఆఫ్ హంగర్ సంస్థ వ్యవస్థాపకురాలు ఆలేఖ్యకు మరియు వారి బృందానికి కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పాండు గౌడ్, పోశెట్టిగౌడ్, సంతోష్ బిరాదర్, వెంకటేశ్వరరావు, రవి కిరణ్, కృష్ణారావు, రమణ రెడ్డి, మీరయ్య, మహేందర్, హేశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
