బేతవోలులో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
సాక్షిత: చిలుకూరు మండలం బేతవోలులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ జెండాను ఆవిష్కరణ చేస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు అక్కినపల్లి జానకీరామాచారీ, నాయకులు మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను అ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అక్కినపల్లి జానకీరామాచారీ, తాళ్ళూరి శ్రీను, ఉప సర్పంచ్ -బెల్లంకొండ నాగయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ గ్రామ గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

