బంగారు చీరతో శ్రీ వాసవిఅమ్మ వారు
అమ్మవారిని చూసి పరవశించిన భక్తులు
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవం సందర్భంగా అమ్మవారు బంగారు చీరతో భక్తులకి దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు అవధానం నందకిషోర్ శర్మ సమక్షంలో అమ్మవారికి మంగళ వాయిద్యాలతో, కుంకుమార్చనలతో, అభిషేకాలతో, నైవేద్యాలతో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కీ”శే” గుర్రం వెంకట పార్థసారథి జ్ఞాపకార్థం నిర్మల కుమారుడు శ్రీ వెంకట నవీన్ కుమార్ – అనూష భక్తిశ్రద్ధలతో ఉభయ నైవేద్యాలు సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవారికి ఉయ్యాల సేవ సాంప్రదాయబద్ధంగా చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్న ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ సి.హెచ్. వెంకటేశ్వర్లు, సెక్రటరీ యస్. రమేష్ బాబు, కోశాధికారి మెంటా రమేష్ బాబు, ఆలయ పాలకవర్గం మరియు ఆర్యవైశ్యుల సంఘం సభ్యులు, భక్తులు, పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY