Children’s awareness about stray dogs in Zilla Parishad High School
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ మెయిన్ రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో వీధి కుక్కలపై పిల్లలకు అవగాహన కల్పించడం కోసం జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వీదింకుక్కల సమస్య పైన జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగింది అని, పిల్లలు వీధులలో ఉండే కుక్కల ను చూసినప్పుడు వాటిని చూసి పరిగెత్తడం కాని, వాటి జోలికి వెళ్ళడం కానీ చేయరాదని, వాటికి దూరంగా ఉండాలని, అలానే వాటి మీద రాళ్లు వేయడం కానీ, అదిలించడం కానీ చేయరాదని, అలానే కుక్క పిల్లలు ఉన్న చోట చాలా దూరంగా ఉండడం వల్ల పిల్లల తల్లి అయిన కుక్క కు కోపం తేపించకుండ మసలుకోవాలి అని చెప్పడం జరిగింది.
అలానే జిహెచ్ఎంసి అధికారులు చాలా బాగా పిల్లలకు, ప్రజలకు అవగాహన కల్పించడం మంచి పరిమాణం అని, బిఅర్ఎస్ ప్రభుత్వం అన్ని బస్తీ దవాఖాన ల్లో కుక్క కాటు మందు ను ఉచితంగా అందుబాటులో ఉంచిందని, ఎవరిపైనన్న వీధి కుక్కలు కరిచినచో వెంటనే కుక్క కాటు మందు వేయించుకోవాలి అని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డాక్టర్ మమత, ఈ ఎస్ అశ్విని, పి ఓ ఇంద్రసేన, సి ఓ ముస్తఫా, ఎస్ ఆర్ పి సత్యనారాయణ, ఎస్ ఎఫ్ ఐ సంజీవరావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంఛార్జి, టీచర్లు, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.