చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎం రాధా కృష్ణ
చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గా యం రాధాకృష్ణ ను నియమించారు. ఈ రోజు పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి 50 నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను నియమించారు. ఈ నియామకాలలో భాగం గా పల్నాడు జిల్లా లోని చిలకలూరిపేట సమన్వయకర్త గా 2019, 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట శాసనసభా నియోజకవర్గం నుండి పోటీ చేసిన రాధాకృష్ణ ను నియమించారు.