10 వ జోనల్ ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లేల చిన్నారెడ్డి
*సాక్షిత వనపర్తి నవంబర్ 11″
వనపర్తి జిల్లా
గోపాల్ పేట మండలం బుద్ధారం గండిలో ఉన్న బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆరోగ్య ఆధ్వర్యంలో పదవ జోనల్ ఆటల పోటీలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కాగడా వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు.ప్రిన్సిపల్ ఆరోగ్య మాట్లాడుతూ ఈ స్కూల్ కు పునాది రాయి2014 వ సంవత్సరంలో వేసినది చిన్నారెడ్డి అలాగే కేవలం 3 సంవత్సరాలలో ఇంత అందమైన భవనాలు పూర్తి చేసినటువంటి గొప్ప వ్యక్తి చిన్నారెడ్డి అని కొనియాడారు, అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా జీవితంలో మనిషికి ఎంతో ముఖ్యం,మిరు ఆటలలో బాగా రాణించి ఈ దేశానికి గోల్డ్ మెడల్ బంగారు పథకాలను సాధించాలని విద్యార్థులను కోరారు,అలాగే ఈ పాఠశాలకు కావాల్సిన ఇంకో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కస్మోటిక్ చార్జీలు పెంచినారు.పెంచిన చార్జీలు ఈ నెల నుంచే అమలులోకి వచ్చింది అని విద్యార్థులకు తెలియజేసినాడు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్ ,వ్యవసాయ మార్కెట్ ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ సింగిల్ విండో ఛైర్మెన్ రఘు ,మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ శేఖర్ ,సుధాకర్ రావు ,గోపాల్ పేట మండలం ప్రధాన కార్యదర్శి జిల్లెల ప్రవీణ్ కుమార్ రెడ్డి ,గోపాల్ పేట టౌన్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ ,స్కూల్ స్టాప్ , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుద్ధారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
10 వ జోనల్ ఆటల పోటీలకు ముఖ్య అతిథి
Related Posts
రావులపల్లి కలాన్ గ్రామానికి వైకుంఠ రథం అందజేత
SAKSHITHA NEWS రావులపల్లి కలాన్ గ్రామానికి వైకుంఠ రథం అందజేత శంకర్పల్లి :నవంబర్ 11:శంకర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన వానరాసి క్రిష్ణమూర్తి వారి నాన్న, నానమ్మ జ్ఞాపకార్థంగా రావులపల్లి కలాన్ గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం డొనేట్ చేశారు.…
అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం పూర్వజన్మ సుకృతం
SAKSHITHA NEWS అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం పూర్వజన్మ సుకృతం -అన్నదానం ప్రారంభ కార్యక్రమంలోడీసీసీబీ డైరెక్టర్, కామేపల్లి మాజీ జెడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; ఎంతో దీక్షతో, నిష్టతో అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు…