SAKSHITHA NEWS

చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కై అలుపెరగకుండా శ్రమించారు….. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందన ఎమ్మెల్యే గాంధీ*

పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తదనంతరం కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలోమర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అభినదించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ
ప్రజాస్వామ్యంతో అత్యంత కీలకమైన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకున్న నియోజకవర్గ ఓటర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు,కార్యకర్తలకు బీఆర్‌ఎస్ అభిమానులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పటికీ తనకు అఖండ మెజార్టీ అందించటమే కాకుండా.. బీఆర్‌ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపుకోసం నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు తామే అభ్యర్థిలా భావించి అలుపెరగకుండా శ్రమించారని ఎమ్మెల్యే గాంధీ అభినందించారు. రాజకీయ పరంగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నా నిజమైన నిఖార్సయిన గులాబీ శ్రేణులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రజా క్షేత్రంలో నిలబడి అవిరళ, నిర్విరామంగా కృషి చేసారన్నారు. పదేండ్ల కాలంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లటంలో, ఓటర్లను చైతన్య పరచటంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల కృషి స్తూర్తి దాయకమని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. కార్యకర్తలే ఎప్పటికయినా పార్టీకి బలమని బలగమని గులాబీ సైనికులు ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపించారని ఈ సందర్భంగా నియోజకవర్గ, డివిజన్‌, కాలనీ , బూత్‌ స్థాయి నేతలు, మహిళా కార్యకర్తలకు ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు ఎన్నికలలోనూ ఇదే స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ పటేల్ ,కరీం, సాంబయ్య, పూర్ణ, అమినుద్దీన్, అహ్మద్, హర్షద్,జాఫర్, చారి, సాహెల్, జహీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 05 17 at 15.32.55

SAKSHITHA NEWS