రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్ట్: బండి
టీడీపీ చీఫ్ చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. నేరం చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరూ కాదనరని అన్నారు. అయితే FIRలో పేరు లేని వ్యక్తిని అరెస్టు చేయడమే అర్థం కావట్లేదని చెప్పారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ అరెస్టుతో ఏపీ ప్రజల్లో చంద్రబాబుకి మైలేజ్ వచ్చిందని బండి పేర్కొన్నారు.