గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం లలో చంద్రబాబు సభలు.
ముత్తముల, కందుల, గూడూరి ఏరీక్షన్ బాబు లతో కలసి పరిశీలించిన నూకసాని.
రోడ్ మ్యాప్ పరిశీలన లో రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి రవి యాదవ్, రాబిన్ శర్మ టీం నుంచి రవీంద్ర లు పాల్గొన్నారు.
మూడు రోజులు 19, 20, 21న ప్రకాశం జిల్లాలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పర్యటన.
విజయవంతం చేయాలని నూకసాని పిలుపు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ను తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి రవి యాదవ్, రాబిన్ శర్మ టీం నుంచి రవీంద్ర లతో కలసి ఆయా నియోజకవర్గ ఇంచార్జి లు, ముఖ్య నేతలతో కలిసి పరిశీలించారు. ఈనెల 19 20 21 తేదీల్లో జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంటుందని నూకసాని బాలాజీ తెలిపారు.
గిద్దలూరు పర్యటన
19 వ తేదీ న గిద్దలూరు నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు పర్యటన మొదలవుతుంది. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తో కలసి ఆ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి పర్యటన రూట్ మ్యాప్ పై ఒక అవగాహనకు వచ్చినట్లు నూకసాని బాలాజీ గారు తెలిపారు. ముత్తముల అశోక్ రెడ్డి తో మరోసారి చర్చించి సభ జరిగే ప్రదేశాలను నిర్ణయిస్తామని నూకసాని బాలాజీ తెలిపారు.
మార్కాపురం పర్యటన
20 వ తేదీన మార్కాపురం లో చంద్రబాబు నాయుడి రోడ్ షో, సభలు జరిగే ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సోదరుడు కందుల రామిరెడ్డి తో కలసి నూకసాని బాలాజీ పరిశీలించారు. కందుల నారాయణ రెడ్డి పాదయాత్రలో ఉన్న కారణంగా తదుపరి ఆయన తో చర్చించి వేదికలను నిర్ణయిస్తామని నూకసాని బాలాజీ తెలిపారు.
ఎర్రగొండపాలెం పర్యటన
21 వ తేదీన చంద్రబాబు నాయుడి వై.పాలెం పర్యటన కు సంబంధించి రోడ్ షో, సభలు జరిగే ప్రదేశాలను నియోజకవర్గ ఇంచార్జి గూడూరి ఏరీక్షన్ బాబు తో కలసి నూకసాని బాలాజీ పరిశీలించారు.
ఈ సందర్భంగా నూకసాని బాలాజీ విలేకరులతో మాట్లాడుతూ మూడు బహిరంగ సభలు రాష్ట్రానికి ఆదర్శం కావాలని, ప్రకాశం జిల్లా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభలను జయప్రదం చేయాలి కోరారు. ప్రతి ఒక్కటీడీపీ కార్యకర్త కదలి రావాలని నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.