SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ సక్సెస్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్

దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థలను ఏర్పాటు చేసి నవభారత నిర్మాణం చేసింది.

మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో సృష్టించిన ప్రభుత్వ సంపదను క్రోని క్యాపిటలిస్టులకు దోచిపెడుతున్నాడు

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని మోడీ నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలను దిగజార్చుతుండు

130 కోట్ల ప్రజలకు చెందిన సంపదను కార్పొరేట్లకు పంచి పెడుతూ ప్రజలను పేదలుగా మార్చుతున్న మోడీ

ప్రజలకు చెందిన దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది

మోడీ పాలనలో దేశం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నది

ఆదాని ఆర్థిక నేరం గుట్టును బట్ట బయలు చేసిన అమెరికా చెందిన హిడెన్ బర్గ్ సంస్థ

ఎల్ఐసి లాంటి సంస్థలను దివాలా తీయించి ఆర్థిక నేరానికి పాల్పడిన ఆదానిని అరెస్టు చేయకుండా అడ్డుకుంటున్న ప్రధాని మోడీ

ఆదాని ఆర్థిక వ్యవహారం పై ప్రధాని మోడీ ఎందుకు నోరు మెదపడం లేదు

క్రోనీ క్యాపిటలిస్టులకు మోడీ దోచిపెడుతున్న దేశ సంపద ప్రజలకు చెందాలని పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ

దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బిజెపి పాలకులను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

పోలీసు నిర్బంధాలు, అరెస్టులు చలో రాజ్ భవన్ ఉద్యమాన్ని అడ్డుకోలేరు.

ఎన్ని నిర్బంధాలు విధించిన కేసులు పెట్టిన ప్రజల కోసం మా పోరాటం ఆగేది లేదు

రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు