సామాన్యుడి పై అధిక భారం వేస్తూ , హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం

Spread the love

సాక్షిత : సామాన్యుడి పై అధిక భారం వేస్తూ , హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ ధరలకు వ్యతిరేఖంగా మంత్రి ,బీఆర్ ఎస్ పార్టీ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ఆధ్వర్యంలో కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ లో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి , కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ , మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ,మహిళ సోదరీమణులతో కలిసి నిరసన తెలిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భారత దేశ జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతున్నదని, సామాన్యుడి పై అధిక భారం వేస్తూ , హద్దు పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలకు వ్యతిరేఖంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిరసన తెలపడం జరిగినది అని, కేంద్ర ప్రభుత్వం తన ఇష్టారీతిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిస్తుంది అని,గ్యాస్ బండ సామాన్య ప్రజానీకానికి ఒక గుది బండ లాగా మారినది అని, వంట నూనెలు,పప్పు దినుసుల నుండి పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా పేద ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసింది. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది.తరుచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతున్నది. డొమెస్టిక్ సిలిండర్ పై రూ. 50 చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై రూ. 350 చొప్పున పెంచడం దారుణమైన చర్య , దేశంలో వాణిజ్య సిలిండర్‌ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.నాడు గ్యాస్ ధరలు 400 ఉంటే అప్పటి బిజెపి నేతలు గగ్గోలు పెట్టారు.

స్మృతి ఇరానీ గ్యాస్ బండ తో రోడ్ల మీద ధర్నా చేసింది. ఇప్పుడు అదే స్మృతి ఇరాని కేంద్ర మంత్రిగా ఉంది. బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది, చాయి బండి కాడ చర్చ పెట్టండి 400 సిలిండర్ 1100 చేశామని.ఒకవైపు పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచి సామాన్యుడి ప్రయాణాన్ని భారంగా మార్చిన మోదీ ప్రభుత్వం.. మరోవైపు వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలను పెంచుతూ జేబులు గుల్ల అయ్యే దుస్థితిని తీసుకొచ్చింది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ఎన్నిక‌లు అయిపోన ప్రతి సారి గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెంచ‌డం అనవాయితీగా మారింది అని ఎద్దేవా చేశారు,మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర లో ఎన్నికలు అలా అయిపోయాయో లేదో మళ్ళీ ధర పెంచారు.ఎన్నికలు రాగానే 10 పైసలు తగ్గించి ఎన్నికలు అయిపోగానే 100 రూపాయలు పెంచుతున్నాడు ప్రధాని మోడీ. బిజెపి అచ్చే దిన్ అంటే గిట్ల ఉంటది.


మీ పాలన అచ్చే దిన్ కాదు, మీ ధరల పెరుగుదల చూసి సామాన్యుడు భయపడి రోజు సచ్చేదిన్ అవుతున్నది. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పట్టపగలే చుక్కలు చూపుతుంటే మరొక్క పక్క గ్యాస్ ,పెట్రోల్, డీజిల్ ధరలు మరొక వైపు పెంచుకుంటు పోతే సామాన్యుడి బ్రతుకె ప్రశ్నార్థకంగా మారినది అని,ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు అదేవిధంగా గ్యాస్ ధర పెంచడం వలన వంటింట్లో మహిళలకు మరింత పెను భారం అయినది అని , భవిష్యత్తు లో మహిళల ఆగ్రహం చవిచూడాల్సినది అని, రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ సర్కార్‌కు దక్కుతుందన్నారు. తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు

.అదేవిధంగా 2014లో పెట్రోల్‌ ధర రూ.60 ఉండేదని, ఆరోజు క్రూడాయిల్‌ ధర ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పారు. ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్‌ ధరలు పెంచారని విమర్శించారు. ఆయిల్‌ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ఉద్యమాలకు మోదీ ప్రభుత్వం లొంగక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం పై భవిష్యత్తు లో ప్రజా ఆగ్రహం తప్పదు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, మహిళనాయకులు,వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీ ప్రతినిధులు, మహిళలు ,బీఆర్ ఎస్ పార్టీ శ్రేయభిలాషులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page