SAKSHITHA NEWS

CENTRAL కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి డిమాండ్

సాక్షిత

కార్మికుల కోరికల దినోత్సవం సందర్భంగా గజ్వేల్ లోని ఐఓసీ బిల్డింగ్ ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల స్వామి పాల్గొని మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేసినారు.అతను మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానాన్ని రద్దు చేయాలని, బొగ్గు గనుల బ్లాక్ లను వేలం వేయడాన్ని నిలుపుదల చేయాలని, సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, 73 షెడ్యూల్ పరిశ్రమల జీవోలను సవరించాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలను కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలను నిర్ణయించాలని, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, ఐకెపి వివోఏ, ఆర్పి, వైద్య, ఆరోగ్య రంగం తో పాటు వివిధ స్కీముల లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను కార్మికులగా గుర్తించి చట్టాలు అమలు చేయాలని జీవో నెంబర్ ఐదు ని సవరించాలని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని, ఈపీఎఫ్ చెల్లింపులో జాప్యం చేసిన యాజమాన్యాలకు విధించే జరినామాలను తగ్గించడానికి చేసే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు అయ్యర్ పెన్షన్ పెంచాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఈపీఎఫ్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూపాయలు తొమ్మిది వేలకు తగ్గకుండా చెల్లించాలని భవన నిర్మాణ, హమాలీ, ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికి అర్హతలను బట్టి ప్రమోషన్ ఇవ్వాలని పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లతో స్థానిక ఆర్డిఓ కి వినతి పత్రం ఇచ్చినారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ సందిటి రంగారెడ్డి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాసగోని వేణుగోపాల్ సిఐటియు నాయకులు వెంకటాచారి, మల్లయ్య, రాజులు ,రమేష్ రామారావు మహేందర్ రెడ్డి మనోజ్ కుమార్, శ్రీనివాస్, లక్ష్మణ్, పరుశురాములు, కార్మికులు పాల్గొన్నారు

CENTRAL

SAKSHITHA NEWS