SAKSHITHA NEWS

మహిళా దినోత్సవ సందర్భంగా 1000 మంది మహిళలకు పసుపు ,కుంకుమ తో పాటు చీరలు పంపిణీ చేసిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు .మొదట కేక్ కట్ చేసి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన సవితమ్మ . అనంతరం సవితమ్మ మాట్లాడుతూ

మహిళా దినోత్సవం సంధర్బంగా మహిళా సాధికారత అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదని
అదే విదంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో లో మహిళా దినోత్సవం సందర్బంగా ‘కలలకు రెక్కలు ‘ పథకం గూర్చి మహిళలకు వివరించారు ,మహిళా సాధికారత , సంక్షేమం తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యం, చంద్రబాబు నాయుడు ను ముఖ్యమంత్రి ని చేస్తేనే మహిళలకు రక్షణ ఉంటుంది అని మహిళలను ఉద్దేశించి పిలుపునిచ్చారు .

మహిళా సాధికారతకు తెలుగుదేశం పార్టీ మొదట్నుంచి పెద్దపీట వేస్తోంది. అన్న ఎన్టీఆర్ అదికారంలోకి రాగానే మహిళలకు రాజకీయాల్లో 9% శాతం రిజర్వేషన్లు కల్పించగా చంద్రబాబు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాలు, కళాశాలల్లో 33% రిజర్వేషన్లు అమలు చేశారు.

టీడీపీ అధికారంలోకి రాగానే మహిళా సాధికారతకు మరిన్ని చర్యలు చేపడతాం. విరివిగా డ్వాక్రా రుణాలు అందించి వారి ఆర్థిక స్వావలంబనకు బాటలు వేస్తాం.

గత టీడీపీ హయాంలో మహిళా రక్షణకు చంద్రబాబు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఫోర్త్ లయన్ యాప్, అభయ, షీ టీం ల ఏర్పాటుతో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేశారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై 2 లక్షలకు పైగా నేరాలు జరిగాయి. ఏపీని అత్యాచారాలకు అడ్డాగా మార్చేశారు.

చంద్రబాబు గారు మహిళా పక్షపాతి. మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వాళ్లు నిలబడాలని డ్వాక్రా సంఘాల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఈసారి అధికారంలోకి వచ్చాక మహిళల భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మహానాడు వేదికగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు.

‘‘ఆడబిడ్డ నిధి’’ కింద నెలకు రూ.1,500 చొప్పున 18ఏళ్లు నుండి 59ఏళ్ల వయస్సున్న మహిళలకు నేరుగా వారి ఖాతాలోకి జమ చేయడం వల్ల వారికి ఆర్థిక చేయూత లభిస్తుంది. చదువు, చిరు వ్యాపారం సహా ఇతర అవసరాలకు ఆ నగదు ఉపయోగపడుతుంది.

‘తల్లికి వందనం’’ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో వారందరికీ ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున అందించడం వల్ల చిన్నారుల బంగారు భవిష్యత్ కు బాటలు పడతాయి.

ఇప్పటికే చంద్రబాబు గారు దీపం పథకం కింద 65 లక్షలమందికి ఉచిత గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వల్ల మహిళలకు ఆర్థిక చేయూత అందించినట్లవుతుంది.

ఈ ఐదేళ్లలో జగన్ రెడ్డి ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచాడు. ఇకపై పేద, మధ్యతరగతికి ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం పథకం తెచ్చారు. పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని కావున వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ని చేసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నరసింహురావుగారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….

WhatsApp Image 2024 03 08 at 5.04.57 PM

SAKSHITHA NEWS