SAKSHITHA NEWS

1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన కె.ఎం. పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ నూతన భవనం ప్రారంభించిన మంత్రి,ఎమ్మెల్యేలు..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయ పితామహుడు కీర్తిశేషులు కె.ఎం.పాండు 78వ జయంతి సందర్బంగా 1కోటి రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ సొంత నిధులతో నిర్మించిన కె.ఎం. పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ నూతన భవనాన్ని మంత్రి మల్లా రెడ్డి , కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు గారు ముఖ్య అతిధులుగా పాల్గొన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కె.ఎం. పాండు 20 సంవత్సరాలు సర్పంచ్ గాను, మేడ్చల్ పంచయతరాజ్ సమితి వైస్ ప్రెసెడెంట్ గాను,కుత్బుల్లాపూర్ మున్సిపల్ మొదటి చైర్మన్ గా, మూడు దశాబ్దాలపాటు నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు అందించారు అని, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తన తండ్రి పేరు మీద వారి జ్ఞాపకార్థం నియోజకవర్గ పరిధిలో పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒకేషనల్ కాలేజీ నిర్మాణానికి తలపించడం గర్వకారణమని, తండి అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎమ్మెల్యే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ ఫీజు చెలించని స్థితిలో ఉన్న పేద విదార్థులు విద్య గురుంచి చింతించాల్సిన అవసరంలేదు అని, ఇప్పుడు నిర్మించిన ఈ ఒకేషనల్ జూనియర్ కాలేజీ, త్వరలో నిర్మించబోతున్న డిగ్రీ మరియు మెడికల్ కాలేజ్ పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని నియోజకవర్గ విద్యార్థులు ఈ కాలేజీలను సద్వినియోగ పరుచుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు,డివిజిన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అనుబంద సంఘాల నాయకులు సభ్యులు, మహిళ నాయకురాళ్ళు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS