ఘనంగా డా.భాగ్య రెడ్డి వర్మ 135 జయంతి వేడుకలు

Spread the love

ఘనంగా డా.భాగ్య రెడ్డి వర్మ 135 జయంతి వేడుకలు

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

ఆది హిందు ఉద్యమ పితా మహుడు డా.భాగ్య రెడ్డి వర్మ 135 వ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి అడిషనల్ యస్.పి కె ఆర్ కె ప్రసాద రావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించి, విద్యా విప్లవం సృష్టించి, మాహాత్మ జ్యోతి రావు పూలే వారసత్వాన్ని కొనసాగించిన భాగ్యరెడ్డి వర్మ మహనీయుడని అన్నారు. వారి స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలో భాగ్యరెడ్డి వర్మ ఎన్నో పాఠశాలను ప్రారంభించి అన్ని వర్గాల వారికి చదువును అందించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఓ మంజు భార్గవి, వెల్ఫేర్ ఆర్.ఐ స్పర్జన్ రాజ్, ఏఆర్ యస్.ఐ చిన్న బాబు,సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page