
Celebrating 138th Foundation Day of Congress Party

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని, అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు మొహమ్మద్ సజుభాయ్
స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. భారతదేశాన్ని విముక్తి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన లిఖిత రాజ్యాంగాన్ని రచించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ దేశానికి బడుగు బలహీన వర్గాలకు ప్రతి పౌరుడు భారతదేశంలో ఉన్నత అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మాజీ పట్టణ అధ్యక్షులు మొలుగూరి సదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జద్ మహమ్మద్, జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి, జమ్మికుంట పట్టణ ఉపాధ్యక్షులు బుర్ర కుమార్ గౌడ్, జపాన్, నిహాల్, పర్వేజ్, జియా , మొలుగూరి రమేష్, బల్మూరి బబ్లు ,అజ్మత్ శ్రీనివాస్, గుళ్లి సతీష్, డాక్టర్ అక్బర్, మొలుగురి అశోక్ , తదితరులు పాల్గొని విజయవంతం చేసినారు.
