SAKSHITHA NEWS

రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్ పనులను పరిశీలించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో సి.సి రోడ్ పనులను నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించడం జరిగింది పనులు జరుగుతున్న తీరును మున్సిపల్‌ వారిని అడిగి తెలుసుకొని నిబంధనల ప్రకారం విస్తరణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రాజీవ్ గాంధీనగర్ బస్తి వాసులు మరియు వివిధ కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొలన్ క్రిష్ణా రెడ్డి, సాయి రాజ్, కొలన్ జీవన్ రెడ్డి, విష్ణు, కొలన్ బాల్ రెడ్డి, శరత్, మహేందర్, శ్రీనివాస్ గౌడ్, కాలనీ వాసులు మరియు NMC అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS