SAKSHITHA NEWS

హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లకి క్యాప్, బెల్ట్, లోగో అందచేత
-ఎస్పీఎఫ్ యూనిఫామ్ మార్పు
-జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు
సాక్షిత రాజమహేంద్రవరం :
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మరియూ హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఇప్పటివరకు ధరిస్తున్న ఖాకి బారెట్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్, లోగో మార్పు చేసి కొత్త గా రూపకల్పన చేసినవి అందచెయ్యడం జరిగిందని జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు పేర్కొన్నారు. ఎస్పీఎఫ్ రాజమహేంద్రవరం వారి కార్యాలయంలో జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు ఆవిష్కరించి హెడ్ కానిస్టేబుల్ , కానిస్టేబుల్ లకు అందచేశారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు మాట్లాడుతూ, ప్రత్యేక రక్షణ దళాధిపతి సి ఎం త్రివిక్రమ వర్మ ప్రతిపాదనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోం శాఖ జీవో ఎం ఎస్ నెంబర్ 93 ద్వారా ప్రస్తుతం ధరిస్తున్నటువంటి ఖాకి బారెట్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్ మరియు భుజముపై ధరించే లోగోలో మార్పు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసి యున్నారని పేర్కొన్నారు.

ఆమేరకు ఇప్పటినుండి కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ స్తాయి అధికారులు ఖాకీ బారెట్ క్యాప్ బదులుగా ప్రస్తుతం పోలీసు శాఖలో ధరిస్తున్న మాదిరిగా బ్లూ పీక్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్ బదులుగా బ్లాక్ లెదర్ బెల్ట్ , భుజానికి ధరించే లోగోలో పూర్ణకుంభానికి బదులుగా గండభేరుండ పక్షి కలిగిన లోగోను సిబ్బంది అందరూ ధరించవలసి ఉంటుందన్నారు. మార్పు చేయబడిన కొత్త యూనిఫామ్ ఆవిష్కరణను ఇకపై సిబ్బంది అందరూ మార్పు చేయబడిన యూనిఫామ్ లనే ధరిస్తారని, ఆ మేరకు చర్యలు చేపట్టడం జరిగిందనీ తెలియజేశారు. ఈ మార్పు పట్ల ఎస్పీఎఫ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఈ మార్పు కి కారణమైన దళాధిపతి సీఎం త్రివిక్రమ వర్మ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పి.వి.ఎస్.ఎ.డి.ప్రసాద రావు, ఒ. కృష్ణయ్య, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు, తదితరులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


SAKSHITHA NEWS