SAKSHITHA NEWS

Call money again fangs

కాల్ మనీ మళ్ళీ కోరలు చాస్తుంది


సాక్షిత : కాల్ మనీ బాధితులు చెప్పుకోలేక తమ ప్రాణాలు వదులుతున్నారని సమాచారం కొత్తగా వచ్చిన అప్ లు సైతం ఇదే తరహా పోలీస్ వారు మాత్రం జాగ్రత్తగా ఉండమని ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారు కొన్ని అప్ ల మీద కూడా చర్యలు తీసుకున్నారు,

ఒకరికి ఇంటి అవసరాలు, ఇంకొకరికి హాస్పిటల్, ఇంకొరికి పిల్లల ఫీజులు అవసరం ఏదైనా అందరికి పీకల మీదకి వచ్చేసరికి ఎవరి సహాయం అందక వాళ్ళు వడ్డీ ఇచ్చే వారిని ఆశ్రయిస్తున్నారు, అవసరాని బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వడ్డీలు పిండుకుంటున్నారు, కొందరు వడ్డీలు కట్టలేక వాళ్ళ ప్రాణాలను సైతం వదులుతున్నారు బ్రతుకు జీవుడా అని బ్రతుకు బండిని నడిపేవారు రోజు వారి వడ్డీలు తీసుకొని వ్యాపారం చేసి సాయంత్రనికి వచ్చినదంతా వడ్డీకి తెచ్చిన వాటికి కట్టడం సరిపోతుందని వాళ్ళ కష్టం వృధా అని ప్రాణాలు వదులుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి అని సమాచారo, ఇలాంటి వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం పేద ప్రజల రక్తం తాగుతున్నారు, కట్టకపోతే వారిమీద ఎంతటి దౌర్జన్యానికి అయిన తెగబడుతున్నారంట,ఇలాంటి వారి మీద నిగా పెట్టి వారి మీద చర్యలు తీసుకోవాలని, ప్రజలు మరియు ప్రజా సంఘాలు కోరుకుంటున్నాయి


అసలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా వీళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళకి యింతగా దైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు మేము ఏం చేసిన చల్లుతుంది అనే ధోరణి ఎలా వస్తుంది, వీరికి చోట మోట నుంచి బడా నాయకుల వరకు అందరి సహకారం ఉంటుందా, ఇలా ఎన్నో ప్రశ్నలు ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థ కొన్నిటికి సమాధానం కోసం వేచి చూడాలి, దీని మీద పోలీసులు కానీ, నాయకులు కాని ఎలాంటి చర్యలు తీసుకుంటారని వేచి చూడాల్సివుంది


SAKSHITHA NEWS