SAKSHITHA NEWS

అల్లా..ద‌య‌తో బాబు బ‌య‌ట‌కు వ‌స్తారు

బట్వాడిపాలెం లోని జామియా నూరుల్ ఉదా మ‌ద‌ర్‌సా ప్రార్ధ‌న‌లు చేసిన మాజీ మంత్రులు పొంగూరు నారాయణ ,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు రిమాండ్ నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌కు రావాల‌ని ఆకాంక్షిస్తూ… నెల్లూరు న‌గ‌రం బట్వాడిపాలెం జామియా నూరుల్ ఉదా మ‌ద‌ర్‌సాలో సందర్శించరు.. మాజీ మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిలు ముస్లిం మ‌త పెద్ద‌ల‌తో క‌లిసి ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు చేశారు. చంద్ర‌బాబునాయుడు క్షేమంగా త్వ‌ర‌గా బ‌య‌ట‌కు రావాల‌ని వారు దువా చేశారు. ముత్యంలాంటి త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబుని ఏమి చేయ‌లేక‌…జ‌గ‌న్ ప్ర‌భుత్వం అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం సిగ్గుచేట‌ని నారాయ‌ణ‌, సోమిరెడ్డి, కోటంరెడ్డిలు ఆరోపించారు. అతి త్వ‌ర‌లోనే ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తార‌ని…2024లో వైసీపీ ప‌త‌నం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మౌలానా ఇలియాజ్‌, జ‌హీర్‌, బ‌షీర్‌, కాలేషా, సాఫ‌ర్ మొహిద్దీన్‌, నౌసాద్‌, ఉస్మాన్‌, ఖాద‌ర్ బాషా, క‌రిముల్లా త‌దిత‌రులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS