కష్టపడిన బీఆర్ఎస్ కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుంది…
ప్రతిపక్షాల దుష్ప్రచారాలు తిప్పి కొట్టాలి…
దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం…
కుత్బుల్లాపూర్ BRS పార్టీ ఆత్మీయ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే, మల్కాజ్ గిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇంఛార్జి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండిమైసమ్మ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సన్నాహక సమావేశానికి రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా ఇంఛార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , ప్రభుత్వ విప్ & ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , మల్కాజ్ గిరి నియోజకవర్గ పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు.. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధినాయకత్వంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని పేర్కొన్నారు.
స్వరాష్ట్రం సాధించిన నాటి నుండి అన్ని రంగాల్లో పురోగతి సాధించి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుందని అన్నారు. కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాలు దేశంలో ఎక్కడా లేవని, దమ్ముంటే బీజేపి పాలితరాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపించాలన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన మోడీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఈడి, ఐటీ దాడులు చేస్తూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు.
తెలంగాణ మోడల్ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో పార్లమెంట్ సీట్లలో పోటీచేసి గులాబీజెండా ఎగురవేస్తామని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుందని, అందుకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించే విధంగా ముందుకు సాగాలన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అర్హులైన వారికి అందించే విధంగా పని చేయాలని సూచించారు. గడిచిన ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మూడో సారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.