SAKSHITHA NEWS

*BRS పార్టీ వికారాబాద్ నియోజకవర్గస్థాయి ప్లీనరీని జయప్రదం చేయండి: వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ లో, రేపు 25వ తేదీన నిర్వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గస్థాయి ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించారు.

వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో మరియు వార్డులలో ఉదయం 7 గంటల నుండి 8 గంటలలోపు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ముగించుకొని, 9 గంటలలోపు వికారాబాద్ పట్టణంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్, ఎన్నేపల్లి లో నిర్వహిస్తున్న, నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంకు BRS పార్టీ ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS