BRS Party stands by the activists..... MLA Dr. Sanjay Kumar.
కార్యకర్తలకు అండగా బి అర్ ఎస్ పార్టీ…..ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ కార్యకర్త అంకతి శ్రీనివాస్
ఇటీవల రోడ్డు ప్రమాదం లో మరణించగా బి అర్ ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయల విలువగల చెక్కులను ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .అనంతరం గ్రామానికి చెందిన మహిళా కార్యకర్త చందా రాధ ప్రమాద వశాత్తూ గాయపడగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .
ఎమ్మెల్యే మాట్లాడుతూ
పార్టీ సభ్యత్వం కలిగిన బి ఆర్ ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బి ఆర్ ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని,ఇటు ప్రభుత్వం సైతం రైతులకు రైతుభీమా ద్వారా భరోసా కల్పిస్తోందని అన్నారు.కార్యకర్తలకు అండగా నిలుస్తున్న పార్టీ ఒక బిఆరెస్ పార్టీ అని,రాష్ట్రం లో 60 లక్షల పైచిలుకు మంది బి అర్ ఎస్ సభ్యత్వం తీసుకున్నారని,బలమైన కార్యకర్తలు గల పార్టీ బిఆరెస్ పార్టీ అని అన్నారు,కార్యకర్తల ల భీమా కోసం దాదాపు 11 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తున్న పార్టీ బిఆరెస్ పార్టీ అని అన్నారు.
జగిత్యాల నియోజకవర్గం లో 53 వేల మంది సభ్యులు కలిగి ఉన్నారు….
ఇప్పటికీ 20 కి పైగా పార్టీ ప్రమాద భీమా చెక్కులు కార్యకర్తల కుటుంబాలకు అందజేయటం జరిగింది.
2 లక్షల చెక్కు తో ఆర్థికంగా కొంత కుటుంబానికి ఊరట కలుగుతుంది…
గౌడ కులస్తులు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం, మరణిస్తే 5 లక్షలు భీమా కెసిఆర్ కల్పించారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేయటం జరిగింది..
గ్రామం లో బ్రిడ్జి లు,చెక్ డ్యాం లు,కుల సంఘం భవనాలు,ఈత తాటి వనం అభివృద్ది చేయటం జరిగింది.
రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం విద్య బోధన చేపట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ దొరకని పరిస్తితి వచ్చింది..
మన ఊరు మన బడి పథకం లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన చేపట్టడం జరిగింది..
రామారావు పల్లి బ్రిడ్జి పనులు పూర్తి అయ్యేలా చూస్తాం..
బి అర్ ఎస్ పార్టీ నాయకుల సమిష్టి కృషి తో ఎమ్మెల్యే గా విజయం సాధించానని వారికి ధన్యవాదాలు అన్నారు…
తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ హయం లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది అని అన్నారు…
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్,మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమాండ్లు,మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్,ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,వైస్ ఎంపీపీ మహేశ్వర రావు,పాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు నేరటి శ్రీనివాస్,సీనియర్ నాయకులు అచ్యుత రావు,నారాయణ గౌడ్,గ్రామ శాక అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి నాయిని శ్రీనివాస్ గౌడ్,మాజీ ఉప సర్పంచ్ చంద్ర శేఖర్,మాజీ amc వైస్ చైర్మన్ కొల్లూరి వేణు,రఘునాథ్,రాజేందర్ గౌడ్,రొట్టె శ్రీనివాస్,రుక్కు భాయ్,సోమయ్య,కనకయ్య,ప్రవీణ్,భూక్యా లక్ష్మి,గంగాధర్,
నాయకులు తదితరులు పాల్గొన్నారు.