SAKSHITHA NEWS

రైతులు పండించిన వరి,వేరుశనగ పంటలకు మద్దతుధర కల్పించాలని డిమాండ్ చేసిన………..బి ఆర్ఎస్

*సాక్షిత వనపర్తి :
జిల్లాలో రైతులు పండించిన వరి వేరుసెనగ పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు న్యాయం చేయాలని బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది బుధవారం బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులతో కలిసి మార్కెట్ యార్డ్ ను సందర్శించి వరి వేరుశనగ ధరలపై రైతులను పలకరించగా ఈ సందర్భంగా రైతులు సదర నాయకులతో వరి వేరుశెనగ ధరలపై వారి ఆవేదన వెలుబుచ్చారు గతంలో పల్లి క్వింటాలుకు ₹7,000 పైబడి ఉండేదని ప్రస్తుత ప్రభుత్వం హయాంలో 5300 కి కొంటున్నారని రైతులు పల్లి విత్తనాలు కొనేటప్పుడు 12 వేల నుండి 18 వేల వరకు వ్యాపారులు అమ్ముతున్నారని ఇప్పుడు తాము పండించిన పంటకు మాత్రం 5300 కి కొంటున్నారని మద్దతు ధర కల్పించకపోతే తాము తీవ్రంగా నష్టం పోతా మనీ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పట్టణ అధ్యక్షులు పలుసు రమేష్ గౌడ్ రాష్ట్ర మార్క్పైడ్ మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్ మాజీ సింగల్ పాండ్ అధ్యక్షులు రఘువరన్ రెడ్డి లు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులు పంటలు పండించేందుకు రైతుబంధు పేరుతో ఆర్థిక సహాయాన్ని అందించి రైతులకు పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేసేదని ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులకు అలాంటి పరిస్థితి లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులతో వెంటనేచర్చించి రైతులకు నష్టం జరగకుండా పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అధికారులు వరి కొనుగోలు కేంద్రాల్లో జాప్యం లేకుండా క్వింటాల్కు 2800 మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయాలని లేకుంటే రైతులతో కలిసి మార్కెట్ కార్యాలయాలను ముట్టడిస్తామని ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు మాణిక్యం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి మున్సిపల్ కౌన్సిలర్లు పెండెం నాగన్న యాదవ్ నుశరత్నిసా బేగం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ మండల యువత అధ్యక్షులు చిట్యాల రాము టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మాధవరెడ్డి ఆశన్న గుద్దేటి బాలస్వామి దడ వాయి ఈశ్వరయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 11 13 at 5.42.15 PM

SAKSHITHA NEWS