brs బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయ

SAKSHITHA NEWS

brs బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఆఫీసు సక్రమమేనని, తమ పార్టీ ఆఫీసు ఇటుక కదిల్చినా.. గాంధీభవన్ కూలుతుందంటూ హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులకు మతిభ్రమించిందని, వారు చేసిన అక్రమాలను నెగ్గించుకునేందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ భవనాన్ని టచ్ చేస్తే గాంధీ భవన్ కూలుస్తామంటున్నారని, మొగోళ్లయితే గాంధీభవన్ ను టచ్ చేయాలని సవాల్ విసిరారు. ల్యాండ్ కబ్జాలు చేసినోళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేసి చెడ్డీలు మీద ఉరికిస్తమని హెచ్చరించారు. దాస్యం వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలు రెండు రోజులకు ఒకటి చొప్పున బయటపెడుతానని పేర్కొన్నారు.

హన్మకొండ జిల్లాను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. ఇక నర్సంపేటలో పీకలేని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడి వచ్చి పీకుతాడా అంటూ ఘాటుగా విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. తాను వాళ్లలా గాలి మాటలు మాట్లాడడం లేదని, అన్ని అధారాలు ఉన్నాయని, వాళ్లకు ఆ స్థలాన్ని కేటాయించలేదని, ప్రెస్ క్లబ్ వెనకాల ఉన్న జాగా ఇస్తే వారు మార్పు కోసం లెటర్ పెట్టారు కానీ.. కేటాయించలేదన్నారు. ఇక కరెంటు మీటరు లేదని, ఇంటి నెంబర్ కూడా లేదని ఇవి నిజాలు కావో లేదో వాళ్లే చెప్పాలన్నారు. వాళ్లదగ్గర ప్రూఫ్ లు ఉంటే తీసుకురావాలని హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

brs

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

telangana తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా

SAKSHITHA NEWS

SAKSHITHA NEWStelangana తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా బస్సు ఫ్రీ అని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్వాలలో ఆర్టీసీ బస్సులో మహిళలకు టికెట్లు తీసుకోవాలని హుకుం జారీ ప్రభుత్వ జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్న మహిళ…


SAKSHITHA NEWS

hyderabad హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత

SAKSHITHA NEWS

SAKSHITHA NEWShyderabad హైదరాబాద్‌లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరా బాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్న 3 కిలోల 3.982.గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీఆర్‌ఐ,అధికారులు ఉదయం స్వాధీనం చేసుకున్నారు.…


SAKSHITHA NEWS

You Missed

telangana తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా

telangana తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా

hyderabad హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత

hyderabad హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత

cm ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

cm ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ని కలిసిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

You cannot copy content of this page