SAKSHITHA NEWS

Boys High School F. L. N. Teaching and learning materials fair

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని బాయ్స్ హై స్కూల్లో ఎఫ్. ఎల్. ఎన్. బోధనా అభ్యసన సామాగ్రి మేళా మరియు భారతదేశ మొదటి మహిళ సాధికారని సావిత్రిబాయి పూలే జయంతి ముఖ్య అతిధులు కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సనల్ కనుమల విజయ నిర్వహించారు

జమ్మికుంట లోని బాలుర ఉన్నత పాఠశాల లో బోధనా అభ్యసనా సామాగ్రి మేళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెడ్పిచైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గోని మేళాను ప్రారంభించారు.
మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారు బోధిస్తున్న ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను సులభంగా విద్యార్థులు అవగాహన చేసుకొనుటకు లో కాస్ట్ తో కూడిన బోధన అభ్యసన సామాగ్రిని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, తాడిల్దర్ రాజేశ్వరీ, ఎంపిడిఓ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య,ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ అధికారి వీర సమ్మయ్య కాంప్లెక్స్ నోడల్ అధికారులు ఆకుల సదానందం, కాత్యాయని,కేపీ నరేందర్రావు పాల్గొన్నారు.