రెండు అంగన్‌వాడీలకు సొంత భవనాలు
-ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
సాక్షిత రాజమహేంద్రవరం : స్థానిక 47వ డివిజన్‌లోని రెండు అంగన్ వాడీలకు సొంత భవనంలోకి మార్పు చేశారు. ఆ భవనాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తమ సతీమణి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ డివిజన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా డివిజన్‌లో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న 1, 2 అంగన్ వాడీలకు సొంత భవానాలు కావాలని విన్నవించగా ఇప్పటికి నెరవేరిందన్నారు.
ఆ రెండు అంగన్ వాడీలను సిద్ధార్ధ నగర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల ఆవరణలో ఒక భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. అంగన్ వాడీకి వచ్చే పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని అంగన్ వాడీ కార్యకర్తలకు సూచించారు. అంగన్ వాడీకి వచ్చింది మొదలు పిల్లలు ఇంటికి చేరే వరకూ వారి బాగోగులు చూసుకోవాలన్నారు. పిల్లలు ఇబ్బందిపకుండా ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌ఛార్జ్ బేసరి చిన్ని, మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవి, స్థానిక టీడీపీ నాయకులు కవులూరి వెంకటరావు, మోతా నాగలక్ష్మి, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.