వనపర్తి సాక్షిత: పుస్తకాలు అజ్ఞానపు చీకటిని తొలగించే దారి దీపాలని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.
గత కొద్ది రోజులుగా సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పుస్తక సేకరణలో భాగంగా వనపర్తి జిల్లాకు చెందిన ప్రముఖ కవులు వల్లభాపురం జనార్ధన,ఖాజామైనొద్ధిన్ లు తమతో ఉన్న దాదాపు వేయి పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ తమ ఇళ్లలో ఉన్న విలువైన పుస్తకాలు నిరుపయోగంగా ఉండకుండా చదివే ఆసక్తి గల వారికోసం వితరణ చేయడం అభినందనీయం అన్నారు.ఈ కోవలోనే పోటీ పరీక్షలకు సంసిద్ధమౌతున్న వారి కోసం కొన్ని పుస్తకాలను సేకరించడం జరిగిందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.పుస్తక పఠనం వల్ల జ్ఞాన సముపార్జనే కాక మనో వికాసం కలుగుతుందని అన్నారు.
ఈనాటి కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్,డా.గుంటి గోపి,వి.ప్రవీణ్,మోహన్,నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాలు జ్ఞానానికి దారి దీపాలు… సాహితి కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
Related Posts
కట్టుదిట్టమైన భారీ బందోబస్తు నడుమ విజయవంతంగా
SAKSHITHA NEWS కట్టుదిట్టమైన భారీ బందోబస్తు నడుమ విజయవంతంగా ముగిసిన రాష్ట్రపతి పర్యటన. సమర్థవంతమైన విధినిర్వహణను కనపరిచిన ప్రతి ఒక్క పోలీస్ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఐపిఎస్ . ప్రజా జీవనానికి, ట్రాఫిక్…
మీ ప్రయాణం కష్టమైనది…క్లిష్టమైనది కానీ సాధ్యమైనది.
SAKSHITHA NEWS మీ ప్రయాణం కష్టమైనది…క్లిష్టమైనది కానీ సాధ్యమైనది. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు . గొల్లపూడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి. సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిల్ ప్రారంభోత్సవం. బీసీ సంక్షేమం, ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం చేనేత జౌళి శాఖామంత్రివర్యులు శ్రీమతి…