SAKSHITHA NEWS

బాడీ బిల్డింగ్ కేవలం బలమైన శరీరానికి మాత్రమే కాదు, ఒక బలమైన మనసుకు కూడా పునాది వేస్తుంది – ఎమ్మేల్యే కె.పి.వివేకానంద..

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ని కలిసిన బాడీ బిల్డింగ్, అథ్లెటిక్ క్రీడాకారుడు మిస్టర్ రంగా రెడ్డి జిల్లా బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన కుత్బుల్లాపూర్ గ్రామ నివాసి క్రాంతి కుమార్ ని ఎమ్మెల్యే అభినందించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

బాడీ బిల్డింగ్ క్రీడ శారీరక దారుడ్యానికే కాకుండా, మానసిక పట్టుదలకూ ఎంతో మేలుచేస్తుంది. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, స్వీయ శక్తిని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడంతో పాటు మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుందనీ వారు తెలిపారు..

అదే విధంగా రానున్నరోజుల్లో క్రాంతి కుమార్ రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో మరిన్ని విజయాలు సాధించి కన్న తల్లి దండ్రులకు, పుట్టిన ఊరు కుత్బుల్లాపూర్ గ్రామానికి, నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు, అలాగే నియోజకవర్గంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడూ ముందు ఉంటానని తెలిపారు..గత ప్రభుత్వం హాయంలో నియోజకవర్గం పరిధిలోని పలు పార్కులలో ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేసిన సంగతి గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంక్షేమ సంఘం నాయకుడు ఆటో బలరాం, తోటి క్రీడాకారులు ఈడుగుల ఈశ్వర్, సంపత్, నరేందర్, బంతి, సాయి కిరణ్, వెంకులు, శివ, సాగర్, చందు, రోహిత్ తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS