SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసిన ప్రజలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు…

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, సంక్షేమ సంఘాల నాయకులు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానించారు, అలాగే సంక్షేమ సంఘాల నాయకులు తమ కాలనీలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే.పీ. వివేకానంద ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, అలాగే మిగిలి వున్న మరియు నూతనంగా చేపట్టవలసిన అభివృద్ధి పనులపై వ్యయ ప్రణాళికలను రూపొందించి తొందరగా పనులు ప్రారంభించాలని అధికారులను అదేశించారు.


SAKSHITHA NEWS