SAKSHITHA NEWS

Blood donation camp in Manthani

image 12

మంథని లో రక్త దాన శిబిరం

సాక్షిత న్యూస్, మంథని:

సహాయ చారిటబుల్ ట్రస్టు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంథని వారి ఆధ్వర్యంలో మంథని ప్రభుత్వ ఆసుపత్రి యందు శనివారం రోజు ఏర్పాటు చేసిన రక్త నమూనా సేకరణ మరియు రక్తదాన శిభిరంను K. వీరబ్రహ్మచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి, మంథని ప్రారంభించారు.

ఈ కార్యక్రమములో (౩3) మంది రక్తదానము చేసినారు. ఇట్టి రక్త దాన కార్యక్రమములో ముత్తారం (మంథని) మండలము, సీతంపల్లి గ్రామ వార్డు సభ్యులు దివ్యాంగుడు మామిడి సంపత్ కుమార్ కూడా రక్త దానము చేసి పలువురికి ఆదర్శముగా నిలిచినందుకు వారిని మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కే వీర బ్రహ్మ చారి,

పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘము తూము రవీందర్,

డాక్టర్ కంది శ్రీనివాస్ ( సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి మంథని, )

కావేటి రాజగోపాల్,
( జిల్లా కన్వీనర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి,)

మేడగొని వెంకటేష్, (అధ్యక్షులు, సహాయ చారిటేబుల్ ట్రస్టు,)

మేడగోని రాజమౌళి గౌడ్, (చైర్మన్, గౌతమేశ్వర ఆలయ కమిటి, మంథని,) లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి, సహాయ చారిటేబుల్ ట్రస్టు సభ్యులు అభినందిస్తూ, యువత కూడా ముందుకు వచ్చి ప్రతి మూడు నెలలకొక్కసారి రక్తదానము చేసి, ఆపదలో వున్నవారి ప్రాణాలు కాపాడి ప్రాణ దాతలు కావాలని కోరినారు.

ఈ కార్యక్రమములో ఇల్లెందుల కిషోర్, రావికంటి సతీష్, తక్కేగారి కిట్టన, మాచిడి మోహన్ గౌడ్, వీర శంకర్, కమ్మగోని రవికుమార్, బుద్దార్తి సతీష్, బొడ్డు సతీష్, కొమురోజు సురేష్, ఐతు డేవిడ్, కంది రవి, వేణు, మంథని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయ సీనియర్ సహాయకులు రవి శంకర్, కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS