షాపూర్ నగర్ లో బీజేపీ విజయోత్సవ సంబరాలు

Spread the love

షాపూర్ నగర్ లో బీజేపీ విజయోత్సవ సంబరాలు.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ జిల్లాల టీచర్స్ MLC గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి AVN రెడ్డి ఘన విజయం సాధించడంతో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం షాపూర్ నగర్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచా కాల్చి, సీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో ఇదే రిపీట్ అవుతుందని, కుత్బుల్లాపూర్ లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాము గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి ,గరిగే శేఖర్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత కంది శ్రీరాములు, రాజేశ్వరరావు, పున్నారెడ్డి, దుర్యోధనరావు, పులి బలరాం, నాయకులు నటరాజ్ గౌడ్, గడ్డం రాజేందర్రెడ్డి, పత్తి రఘుపతి, జగన్మోహన్రావు, సుమన్ రావు, ఏరువా వెంకట్, అర్కల సుధా, బిల్లా వెంకటేష్, కృష్ణ యాదవ్, శ్రీధర్ వర్మ సుశాంత్ గౌడ్, ఆకుల విజయ్ సాయి, శ్రీనివాస్ రెడ్డి, సంగీతా పాత్ర, జూల సందీప్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page