హింసను ఆపలేని బలగాలు ఎందుకు..? అమిత్‌షాకు బీజేపీ ఎమ్మెల్యే ఘాటు లేఖ..
మణిపూర్‌లో ప్రస్తుతం 60 వేల కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ కొన్నిచోట్ల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హింసను ఆపలేని బలగాలు మాకెందుకు?. వాటిని వెనక్కి తీసుకోండి’ అంటూ మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమో సింగ్ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.