SAKSHITHA NEWS

విశాఖలో బీజేపీ సమావేశం

విశాఖలో బీజేపీ జిల్లాఅధ్యక్షుల ఎంపికపై సమీక్ష నిర్వహించే కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు చేపట్టనున్నారు;

విశాఖలో బీజేపీ జిల్లాఅధ్యక్షుల ఎంపికపై సమీక్ష నిర్వహించే కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు చేపట్టనున్నారు. బీజేపీ కేంద్ర నేత శివ ప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి హాజరుకానున్న పురంధేశ్వరి, శ్రీనివాస్‌, సత్యకుమార్ యాదవ్ తో పాటు రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.

ఒక్కరోజులో ఎంపిక…
ఒక్క రోజులో 26 జిల్లాలకు అధ్యక్షుల ఎన్నిక జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా జరుగుతుండటంతో ఈ ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. వీరిలో పార్టీలో వీరి చరిత్రను పరిశీలించిన తర్వాత మాత్రమే ఎంపిక చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


SAKSHITHA NEWS