SAKSHITHA NEWS

గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ సభ్యులు కావూరి సురేష్ కుమార్ పుట్టిన రోజు వేడుకలు
గుడ్ కేర్ హోమ్ లో భోజనాలు, ఫలములు, స్నాక్స్ వితరణ


సాక్షిత రాజమహేంద్రవరం :
రాజమండ్రికి చెందిన గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు, న్యాయవాదియైన కావూరి సురేష్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా గుడ్ కేర్ హోమ్ వృద్ధాశ్రమంలో ఆశ్రమ అధినేత కావూరి వరలక్ష్మి నేతృత్వంలో ఆశ్రమ నివాసులకు భోజనాలు, రకరకాలైన స్నాక్స్, ఫలములు వితరణ చేశారు. ఈ సందర్భంగా కావూరి వరలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పేదల ఆశ్రమంలో జరుపుకోవడం మహానందమని, అనేకులకు మార్గదర్శకం కావడం భాగ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావూరి వరలక్ష్మి ఆశ్రమ సిబ్బంది కృప, ఆశ్రమ నివాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS