కచ్చితంగా అధికారులు నిర్లక్ష్యమే అంటున్న భక్తులు
చిన్నది కాబట్టి సరిపోయింది అదే పెద్దదై ఉంటే ఆలయ పరువు ప్రతిష్టలు మంట కలిసి పోయేవి అని చర్చించుకుంటున్న భక్తులు
ఇంత జరిగినా సంఘటన జరిగిన స్థలాన్ని ఆలయ ఈవో సందర్శించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది
మంటలంటుకున్న పక్కనే సుమారు 25 గ్యాస్ సిలిండర్లు ఉండటం గమనార్హం
పెనుగంచిప్రోలు లో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో లడ్డూలు ఏర్పాటు చేసే కేంద్రాల్లో మంటలు చెలరేగాయి. వెంటనే పక్కనున్న సిబ్బంది అప్రమత్తమై వాటిని ఆర్పి వేయడం జరిగింది. కానీ ఆలయంలో పెను ప్రమాదం తప్పింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఆలయంలో లడ్డులు ఏర్పాటు చేసే కేంద్రం వద్ద అధిక సంఖ్యలో మడ్డి ఏర్పడింది. దాని ప్రక్కన లడ్డూల్లో వాడే నెయ్యి నూనె అధిక సంఖ్యలో డబ్బాలు ఉన్నాయి. ఆ మడ్డి ఉండటం వల్ల నిప్పు దానికట్టుకొని ఆలయంలో మంట చెలరేగింది. అపరిశుభ్రంగా ఉండటం నూనె నెయ్యి ఆ ప్రాంతంలో పడి ఉండటం కూడా ఈ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది ఎందుకు ఆలయాన్ని రోజు రోజుకు కావాలని దిగజారుస్తున్నారు .
ఆలయ ఈవో దానిని ఎందుకు ఇప్పటి వరకు సందర్శించలేదు. భంగం కలుగుతున్న ఎందుకు ఈవో నోరు మెదపటం లేదు. మంటలు చిన్నవైనది కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ పెద్దతై ఉంటే ఈవో ఏం చేసేవారు అసలు ఈవో ఏం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం టెంపుల్ ఇన్స్పెక్టర్ లడ్డు పరిశీలకులది టెంపుల్ ఇన్స్పెక్టర్(లడ్డు పర్యవేక్షకులు )పై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులు పరిశీలన చేయాలి.మరింత కథను దీనిపై మరికొద్ది రోజుల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది.