శంకర్పల్లి: అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ
సాక్షిత శంకర్పల్లి : శంకర్పల్లి మండల పరిషత్ బాలుర ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ భూమి పూజ చేశారు. ఆమె మాట్లాడుతూ ZF ప్రైవేట్ లిమిటెడ్, రౌండ్ టేబుల్ ఇండియా 303 సంస్థల నుండి నిధులు పాఠశాల కోసం మంజూరయ్యా యని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, కౌన్సిలర్ శ్వేత పాండురంగారెడ్డి, MEO అక్బర్, కమిషనర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.