మెరుగైన సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకుని రావాలి
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగురవేసిన సూపరెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జనరల్ ఆసుపత్రి నందు ఆమె జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, సెక్యూరిటీ ఇతర సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ హింసకు తావులేకుండా పనిచేయాలని, మహిళారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేటి యువత ఆల్కహాల్, డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, వారికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న రిహాబిలిటేషన్ సెంటర్ లలో మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. జనరల్ ఆసుపత్రి నందు సిబ్బంది కొరత లేదని, అవుట్ సోర్సింగ్ శానిటరీ సక్రమంగా పనిచేసి ఆసుపత్రిని పరిశుభ్రంగా వుంచాలని అన్నారు.
వైద్యం కోసం వచ్చే రోగులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా మాట్లాడాలని మెరుగైన సేవలు అందించాలని అన్నారు. సిబ్బంది ఆసుపత్రి కి మూలస్ధంభాలని, వారు సక్రమంగా పనిచేస్తేనే ఆసుపత్రి కి మంచి పేరు వస్తుందని అన్నారు.
ఆసుపత్రి నిర్వహణ లో రెసిడెంట్ డాక్టర్ లు ముఖ్య పాత్ర పోషించాలని, వారికి గవర్నర్ కు వున్న అధికారాలు వున్నాయని అన్నారు. ప్రతి వార్డులో కూడ అక్కడి సిబ్బంది భాద్యత తీసుకుని పనిచేస్తే ఎటువంటి ఫిర్యాదులు రావని అన్నారు. ఆసుపత్రి కి గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు వస్తారని వారికి మంచి చికిత్స ఇవ్వడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతా పనిచేయాలని, ప్రతి ఒక్కరూ తమ హక్కులతో పాటుగా విధి నిర్వహణ పట్ల కూడ శ్రద్ద వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్దోపెడిక్ హెచ్ వొడి డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రామకృష్ణ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రశాంతి ఆర్ ఎమ్, డాక్టర్ రమేష్ ఆప్టమాలజిస్ట్, డాక్టర్ గురురాజ్ జనరల్ మెడిసిన్, డాక్టర్ యశ్వంత్ డెంటల్ సర్జన్, డాక్టర్ జనార్దన్ ఆర్ ఎమ్ వొ, డాక్టర్ హరికుమార్ ఎవొ, నర్సింగ్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.