SAKSHITHA NEWS

బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం..

ఆలమూరు:-

మండలంలోని గుమ్మిలేరు బస్టాండ్ సెంటర్ నుండి మోదుకూరు ఓఎన్జిసి రిగ్గు వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. గతంలో భారీ ఓఎన్జిసి వాహనాల వలన పాడైపోయిన రోడ్డులో అటుగా ప్రయాణించే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ గ్రామ సర్పంచ్ గుణ్ణం రాంబాబు ఓఎన్జిసి అధికారులకు తెలియజేశారు. ఈ మేరకు ఓఎన్జిసి అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించగా సర్పంచ్ వాటిని పరిశీలించి ఓఎన్జిసి అధికారులకు అభినందనలు తెలియజేశారు.


SAKSHITHA NEWS